ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి రామానాయుడు, సురేష్ బాబు, వెంక‌టేష్, రానా…వీళ్ల త‌ర్వాత రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు అని గ‌త కొన్ని రోజులుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో.. వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా వెంక‌టేష్ త‌మిళ్ లో విజ‌యం సాధించిన అసుర‌న్ రీమేక్ లో న‌టించ‌నున్నారు.

శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించే ఈ సినిమాలో వెంక‌టేష్ కొడుకు పాత్ర ద్వారా అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ద‌గ్గుబాటి ఫ్యామిలీ స‌న్నిహితులు కూడా ఈ వార్త క‌న్ ఫ‌ర్మ్ చేయ‌డంతో అభిరామ్ ఎంట్రీ ఖాయం అంటూ టాక్ వినిపించింది. ఇదే విష‌యం గురించి సురేష్ బాబుని అడిగితే… అసుర‌న్ రీమేక్ లో అభిరామ్ న‌టిస్తాడ‌ని వ‌స్తున్న వార్త‌ల గురించి విన్నాను.

కానీ.. అలాంటిదేమీ లేదు. అభిరామ్ ప్ర‌స్తుతం యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన త‌ర్వాత ఏ సినిమా ద్వారా ప‌రిచ‌యం చేయాలి అనేది ఆలోచిస్తాను. ప్ర‌స్తుతానికైతే అభిరామ్ ఏ సినిమాకి సైన్ చేయ‌లేదు అని సురేష్ బాబు అభిరామ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.