కిక్కిరిసిన జనం.. సీజ్ చేసిన అధికారులు
By తోట వంశీ కుమార్ Published on 15 April 2020 6:09 AM GMT
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 600లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ప్రబలకుండా సామాజిక దూరం పాటించాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. కొందరు ఈ విజ్ఞప్తులను పాటించడం లేదు. వ్యక్తిగత దూరం సూత్రాన్ని అటకెక్కించారు.
మంగళవారం ఎల్చీనగర్ లోని డిమార్ట్‌ను తనిఖీ చేసిన అధికారులు విస్తుపోయారు. నిబంధనలను ఉల్లగించి విక్రయాలు జరుపుతుండడంతో సీజ్ చేశారు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. సామాజిక దూరం సూత్రాన్ని ఉల్లగించి డిమార్ట్‌లో జనం కిక్కిరిపోయి ఉన్నారు. కరోనా ప్రబలే అవకాశాలు అధికంగా ఉండడంతో అధికారులు డిమార్టును సీజ్ చేసి నోటీసులు అంటించారు.