తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే..ఉస్మానియా ఆస్ప‌త్రిలో వైద్యుల‌పై దాడి మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. మంగ‌ళ‌వారం ఉస్మానియాలో మ‌రో రెండు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో వారిని గాంధీకి షిప్ట్ చేశారు. కాగా.. ఐసోలేష‌న్ వార్డులో ఇద్ద‌రికి పాజిటివ్ రావడంతో.. అదే వార్డులో ఉన్న క‌రోనా అనుమానితుడు అన్వ‌ర్ అలీ తండ్రి డాక్టర్స్ పై దాడి చేశాడు.

పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో తన కొడుకును ఇంటికి తీసుకుపోతానని డాక్టర్స్ తో తండ్రి వాద‌న‌కు దిగాడు. రిపోర్ట్స్ వచ్చేవరకు ఉండాలని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వారించారు. దీంతో.. పేషంట్ తండ్రి, వైద్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పిజి డాక్టర్ల పై పేషంట్ తండ్రి దాడి చేశాడు. చివరకు డాక్టర్స్ కు సారి చెప్పాడు అన్వర్ అలీ తండ్రి. దీంతో వివాదం సద్దుమణిగింది. గతంలో గాంధీ ఆస్పత్రిలో ఇదే తరహాలో దాడులు జరిగాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.