అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం
By సుభాష్ Published on 31 May 2020 5:03 PM IST![అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/Cyclone-Alert.jpg)
ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవులు ప్రాంతాలలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటలలో తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉంది. తరువాత ఇది ఉత్తర దిశగా ప్రయాణించి జూన్ 3 వ తేదీకల్లా ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 1 వ తేదీన కేరళ రాష్ట్రంలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఛత్తీస్ గఢ్ నుండి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.