వారి వ‌ల్లే మ‌నం ఇంత హ్యాపీగా వున్నాం : కిష‌న్ రెడ్డి

By Medi Samrat  Published on  25 Oct 2019 10:36 AM GMT
వారి వ‌ల్లే మ‌నం ఇంత హ్యాపీగా వున్నాం : కిష‌న్ రెడ్డి

నేషనల్ యూనిటీ డే సందర్భంగా అత్తాపూర్ లోని విజయనంద్ క్రికెట్ గ్రౌండ్ లో సీఆర్పీఎఫ్ పోలీసు విభాగం వారు ఫ్రెండ్లీ టీ20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ను మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, హీరో అడవి శేషు ప్రారంభించారు. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో టాలీవుడ్ నటులు జీవిత రాజశేఖర్, శివాజీ రాజా, బెనర్జీ లు పాల్గొన్నారు.

కాగా ఈ మ్యాచ్ లో టీమ్ రెడ్, టీమ్ బ్లూ రెండు టీమ్ లు త‌ల‌ప‌డ్డాయి. మొద‌ట‌గా టీమ్ బ్లూ నుంచి ఓపెన‌ర్లుగా సిఐఎస్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్, యాక్టర్ పృథ్వీరాజ్ బ‌రిలోకి దిగారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ లు చేస్తున్న త్యాగాలను గుర్తించుకునేందుకు ఈ మ్యాచ్ ప్ర‌తీక‌గా నిలుస్తుంద‌న్నారు. సినిమాలలో సైతం పోలీస్ లపై అనేక విమర్షలు చేస్తార‌ని.. కానీ వాళ్ళు చేస్తున్న త్యాగాలు మారువలేమ‌ని అన్నారు. పోలీస్, డిఫెన్స్, వివిధ రక్షణ రంగాల వల్లే మనం ఇంత హ్యాపీగా జీవిస్తున్నామ‌ని.. సామాజిక సమస్యలు, శాంతి భద్రతల పరిరక్షణలో వీరి పాత్ర కీలకమైనదని పోలీసుల ప‌నితీరును కొనియాడారు.

అలాగే.. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న దేశ వ్యాప్తంగా వివిద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల స్థూపాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసామ‌ని.. దాన్ని అందరూ దర్శించాలి కోరారు. పోలీస్ వ్యవస్థని పూర్తిగా మారుస్తున్నామ‌ని.. కొత్త టెక్నాలజీతో కూడిన అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో ఉంచుతున్నామ‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.

Next Story