పెద్ద ఎత్తున మృతి చెందుతున్న కాకులు.. రంగంలోకి దిగిన అధికారులు..!

By సుభాష్  Published on  6 April 2020 7:06 AM GMT
పెద్ద ఎత్తున మృతి చెందుతున్న కాకులు.. రంగంలోకి దిగిన అధికారులు..!

ఒక వైపు కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ కేసులు అధికం కావడంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోతున్నారు. ఇక తాజాగా తమిళనాడులోని పనపాక్కం సమీపంలో పెద్ద ఎత్తున కాకులు మరణిస్తుండటం కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులో పన్నియార్‌ గ్రామంలోని కులత్తుమేడు ప్రాంతంలో ఈ నెల 1న పదికిపైగా కాకులు మరణించడం కనిపించాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం లేక కాకులు మరణిస్తున్నాయని ముందుగా భావించారు.

అపై నిత్యం నివాస గృహాలపై కాకులు నీరసంగా కనిపిస్తూ, ఒకదాని తర్వాత ఒకటి ఆస్మాత్తుగా మరణిస్తుండటం స్థానికులు గమనించారు. కాకులకు కూడా కరోనా వైరస్‌ సోకిందని, అందుకే చనిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో రంగంలోకి దిగిన అధికారులు.. కాకులు మరణించడం వెనుక ఆకలి బాధే కారణమా..? లేక మరేదైన కారణం ఉందా..? అన్న విషయాలపై అన్వేషిస్తున్నారు. కాకుల మరణంపై అసలైన కారణం తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Next Story