మాస్క్ వేసుకుందాం.. మనల్ని మనం కాపాడుకుందాం అంటున్న సెలెబ్రిటీలు

By సుభాష్  Published on  6 April 2020 6:11 AM GMT
మాస్క్ వేసుకుందాం.. మనల్ని మనం కాపాడుకుందాం అంటున్న సెలెబ్రిటీలు

కొన్ని వారాల కింద వరకూ కోవిద్-19 లక్షణాలు ఉన్న వాళ్లు, హెల్త్ కేర్ వర్కర్లు మాత్రమే మాస్కులను వాడాలని ఆరోగ్య సంస్థలు తెలిపాయి. భారత్ లోనూ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే విషయాన్ని పలువురు చెప్పారు. కరోనా లక్షణాలు లేని వాళ్లు కూడా మాస్కులను వాడడం వలన మాస్కుల కొరత ఏర్పడే అవకాశం ఉందని.. అవసరమైన వాళ్లకు అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉందని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.

ఫేస్ మాస్కులు వాడడం చాలా అవసరం అని.. జాగ్రత్త గా ఉండాలని పలు దేశాలకు సంబంధించిన అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల మాస్కులు లేకుండా ఎవరూ బయటకు రాకండి అంటూ నిబంధనలు కూడా పెట్టారు. ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కులు తొడుక్కుని బయటకు వస్తే చాలా ఇన్ఫెక్షన్స్ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకున్నట్లేనని అధికారులు సూచిస్తున్నారు.

హోమ్ మేడ్ మాస్కులు కానీ.. ఇతర మాస్కులు కానీ వాడాలని N95, సర్జికల్ మాస్కులను హెల్త్ కేర్ వర్కర్ల కోసం ఉంచాలని.. అమెరికన్ సిడిసి సంస్థ సూచిస్తోంది. క్లాత్ ఫేస్ కవరింగ్స్ వాడితే మంచిదని.. సర్జికల్ మాస్కులు, N95 మాస్కులు వాడడం వలన మెడికల్ స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్లకు అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉందని వాళ్లు సూచించారు.

'

మీ దగ్గర మాస్కులు లేవా.. టెన్షన్ పడకండి. మంచి క్వాలిటీ ఉన్న కాటన్ క్లాత్ ను ఉపయోగించి మీరే ఒక మాస్కును తయారు చేసుకోండి. రెండు జతల ఫేస్ మాస్కులను తయారుచేసుకోవడం మంచిదని.. ఒక జత ఉతకడానికి.. మరో జత మనం వాడుకోడానికి అని హెల్త్ మినిస్ట్రీ సూచిస్తోంది. వాడిన వాటిని పారేయకుండా.. సోప్, వేడి నీటిలో బాగా ఉతికి.. బాగా ఎండిన తర్వాత తిరిగి ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

ఫేస్ మాస్కుల వాడకం ఎలా:

మాస్కులను వేసుకునే ముందు చేతులను శుభ్రంగా కడగాలి

మాస్కులు ఎప్పుడైతే తేమగా అనిపిస్తాయో.. అప్పుడు మార్చేయడం మంచిది

ఉతక్కుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వినియోగించకండి

ఇతరులతో మాస్కులను పంచుకోకండి

మాస్కులను తీసి వేసే సమయంలో ఎలా:

ఎట్టి పరిస్థితుల్లోనూ.. మాస్కు ముందు భాగాన్ని చేతులతో తాకకండి

మాస్కులను తీసివేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.. లేదా శానిటైజర్ వాడాలి

ఆ తర్వాత వాటిని సోప్ వాటర్ లో.. లేదా ఉప్పు వేసిన వేడి నీటిలో కడగడం మంచిది

పైన చెప్పిన నిబంధనలు కేవలం రీయూజబుల్ మాస్కుల విషయంలో మాత్రమే..!

భారత ప్రజలు కూడా మాస్కులను వాడాలని సూచిస్తూ పలువురు సెలెబ్రిటీలు #MaskIndia క్యాంపైన్ ను సోషల్ మీడియాలో మొదలుపెట్టారు.

నిమ్రత్ కౌర్:

N95 సర్జికల్ మాస్కుల కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. మన కంటే.. మన డాక్టర్లకె వాటి అవసరం ఎక్కువగా ఉంది. ఇంట్లోనే మాస్కులను తయారు చేసుకోవచ్చు.. రెస్పాన్సిబుల్ గా ప్రవర్తించండి. బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండండి.

తాప్సీ:

మీ వ్యక్తిగత సేఫ్టీ కోసం మాస్కును తప్పకుండా వాడాలి. మీకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు.. అతనికి వైరస్ ఉందో లేదో మీరు కనిపెట్టలేరు. కొన్ని క్షణాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మాస్కులను తప్పకుండా వాడాల్సిందే అని సూచిస్తోంది.

మిథాలీ రాజ్:

బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారా.. ఖచ్చితంగా మాస్కులను వాడండి. N95 మాస్కులను హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం మాత్రమే.. దుప్పట్టా, ఏదైనా వస్త్రాన్ని ఉపయోగించి మీకు మీరే మాస్కును తయారు చేసుకోవచ్చు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్:

మాస్కును వాడడం తప్పనిసరే.. వైరస్ మన దరికి చేరకుండా కొంత వరకూ కాపాడుకోవచ్చు. అలాగని ఆందోళన చెందకండి. ఓర్పుగా ఉండండి.. ఇతరులపై జాలి చూపించండి.. అందరం కలిసి పోరాడుదాం. జాగ్రత్తగా ఉండండి.. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉందాం.

కరణ్ వీర్ బోహ్రా:

సర్జికల్ మాస్కులు, N95 మాస్కుల కొరత ఉన్న సమయంలో ఇలాంటి ఒక క్యాంపైన్ చేయడం మంచింది. ఎవరికి వారు తయారు చేసుకున్న ఫేస్ మాస్కులను వాడడం మంచింది. మరోసారి వాడడానికి వీలుగా ఉండే మాస్కులను తయారు చేసుకోవడం చాలా మంచిది.

విజయ్ దేవరకొండ:

ఏదైనా కొనుక్కోడానికి బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ మాస్కులను తప్పకుండా ఉపయోగించండి. స్కార్ఫ్ లేదా హ్యాండ్ కర్చీఫ్ వంటి వాటిని వాడడం చాలా మంచిది. N95, సర్జికల్ మాస్కులు హెల్త్ కేర్ విభాగంలో పనిచేసే వారికి మాత్రమే.

DIY(మీకు మీరే తయారు చేసుకునే) మాస్కులు చాలా బాగుంటాయి.. ఫ్యాషన్ గా కూడా:

రీతు బేరి:

అందరూ N95 మాస్కులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. రెండు లేయర్ల వస్త్రాన్ని ఉపయోగించి నా స్టూడియోలోనే నేను మాస్కును తయారు చేసుకున్నా.. మనల్ని మనం కాపాడుకోడానికి ఇలాంటివి చేసుకోవాల్సిందే.

రీనా ఢాక:

పాత పిల్లో కేస్ తో నేనీ మాస్కును తయారు చేసుకున్నాను. మాస్కులను వాడడం వలన మన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా.. ఇతరుల ప్రాణాలను కూడా కాపాడొచ్చు.

శాంతి మెహ్రా:

రెస్పిరేటరీ డ్రాప్ లెట్స్ ను మాస్కులను వాడడం ద్వారా కట్టడి చేయొచ్చు. హోమ్ మేడ్ మాస్కులను వాడడమే అత్యుత్తమమని.. ముఖ్యంగా నోరు, ముక్కు కప్పి ఉంచేలా చూసుకోవాలని అన్నారు.

రాహుల్ మిశ్రా:

లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా సోషల్ డిస్టెంసింగ్ ను పాటించడం అత్యవసరం. మాస్కులను కూడా ఇంట్లో తయారుచేసుకున్నవే వాడితే చాలా మంచిది.

నమ్రతా జోషిపుర:

చేతులు కడుక్కోవడం, మాస్కులు వేసుకోవడం మన ముందున్న రెండు ముఖ్యమైన పనులు. జాగ్రత్తగా ఉండడం, ఇతరులను కూడా కాపాడడం మన బాధ్యత.

Next Story
Share it