యూపీలో మరో క్రిమినల్ ఎన్‌కౌంటర్
By సుభాష్ Published on 25 July 2020 12:22 PM ISTఉత్తరప్రదేశ్‌లో క్రిమినల్స్ గాలింపు కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను అరెస్టు చేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేతో పాటు అతని అనుచరులను సైతం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇతర క్రిమినల్స్ తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తాజాగా శనివారం బారా బంకీ ప్రాంతంలో టింకు కపాలా అనే క్రిమినల్ ను హతమార్చారు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన క్రిమినల్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. టింకు కపాలా తలపై లక్ష రూపాయల రివార్డు కూడా ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story