మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..? అదే పనిగా వాటిని ఉపయోగిస్తున్నారా..? అయిదే ఇది మీకోసమే. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జైపూర్ జిల్లాలోని ఉదయ్‌పుర గ్రామంలో రాకేశ్ నాగర్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఫోన్ కాల్ రావడంతో బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు.
పెద్ద శబ్దం చేస్తూ.. ఇయర్ ఫోన్స్ పేలిపోయాయి. పేలుడు ధాటికి రాకేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారకస్థితిలో కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే రాకేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఇయర్‌ఫోన్స్ పేలిన సమయంలో రాకేశ్ నాగర్‌కి గుండెపోటు వచ్చి ఉంటుందని ఆ కారణంగానే రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు బావిస్తున్నారు. ఇయర్ ఫోన్స్ పేలి వ్యక్తి ప్రాణాలు కోల్పవడం దేశంలో తొలిసారని అధికారులు చెబుతున్నారు.