స్నేహితురాలి మీదే అత్యాచారం చేయించింది

Young women gang raped in Bopal.ఇటీవ‌ల కాలంలో ఎవ్వ‌రిని న‌మ్మాలో కూడా అర్థం కావ‌డం లేదు. స్నేహితురాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2021 4:46 AM GMT
స్నేహితురాలి మీదే అత్యాచారం చేయించింది

ఇటీవ‌ల కాలంలో ఎవ్వ‌రిని న‌మ్మాలో కూడా అర్థం కావ‌డం లేదు. స్నేహితురాలు పిలిచింది క‌దా అని న‌మ్మివెళ్లిన ఆ యువ‌తికి దారుణ ఘ‌ట‌న ఎదురైంది. ముగ్గురు యువ‌కులు యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డగా.. స్నేహితురాలు ఈ త‌తంగాన్ని అంతా వీడియో తీసింది. ఆ త‌రువాత ఆ న‌లుగురు క‌లిసి బాధిత యువ‌తిని బెదిరించసాగారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. బోపాల్‌లో నివసిస్తున్న బాధితురాలి ఇంటికి ఆగ‌స్టు 23న స్నేహితులైన పూజా, ఆశీష్‌, నిపుల్, పునీత్ లు వ‌చ్చారు. తాము స‌మీపంలోని మండువాకు వెలుతున్న‌ట్లు బాధితురాలికి చెప్పారు. బాధితురాలిని కూడా రావాల‌ని పూజా కోరింది. పూజా పిలిచింద‌ని న‌మ్మ‌కంతో బాధితురాలు వాళ్ల‌తో క‌లిసి వెళ్లింది. వీరంద‌రూ ఆశీష్ అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్లారు. అక్క‌డ బాధితురాలికి మ‌త్తుమందు క‌లిపిన కూల్‌డ్రింక్‌ తాగించారు. దీంతో ఆ యువ‌తి స్రృహా త‌ప్పింది.

ఇదే అదునుగా బావించిన ఆశీష్‌, నిపుల్, పునీత్ లు ఆ యువ‌తి పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ స‌మయంలో పూజా కూడా అక్క‌డే ఉంది. వారిని ఆపాల్సింది పోయి.. ఆ త‌తంగాన్ని మొత్తం మొబైల్‌లో వీడియో తీసింది. మెలుకువ వ‌చ్చాక.. వీడియో చూయించి ఆ న‌లుగురు ఆ యువ‌తిని బెదిరించారు. తాము చెప్పిన‌ట్లు చేయాల‌ని కొట్టారు. కాగా.. దీనిపై బాధిత యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it