దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఓ పథకం కింద ఇళ్లు ఇప్పిస్తామని చెప్పిన ఇద్దరు యువకులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఓ యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియోను తొలగిస్తానని చెప్పి మరోసారి యువతిపై అత్యాచారానికి పాల్పడంతో పాటు యువతిని బెదిరించడంతో యువతిని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇప్పిస్తామంటూ 22ఏళ్ల యువతిని యోగేష్ కుమార్, బబ్లులు ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లి అక్కడ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఇద్దరిలో ఓ యువకుడు వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోతో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం వీడియో తొలగిస్తానని చెప్పి.. బాధితురాలిని పిలిచి యోగేష్ మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీడియో తొలగించకపోగా.. బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.