యువ‌కుడి దారుణ హత్య‌.. వేట‌కొడ‌వ‌లితో వెంటాడి మ‌రీ..

Young man Brutally murder in Nalgonda Dist. న‌ల్ల‌గొండ జిల్లా ఓ యువ‌కుడిపై అత‌డి పెద్ద‌నాన్న కుమారుడే మ‌రో ఐదుగురితో క‌లిసి వెంటప‌డి దారుణంగా న‌రికి హ‌త్య చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2021 5:35 AM GMT
brutally murder

అమ్మ‌మ్మ ద‌శ‌దిన క‌ర్మ‌కు హాజ‌రై .. తిరిగి వెలుతున్న ఓ యువ‌కుడిపై అత‌డి పెద్ద‌నాన్న కుమారుడే మ‌రో ఐదుగురితో క‌లిసి వెంటప‌డి దారుణంగా న‌రికి హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా నిడ‌మ‌నూరు మండ‌లం నార‌మ్మ‌గూడెం శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మిర్యాల‌గూడ మండ‌లం తుంగ‌పాడు గ్రామంలో మ‌చ్చ శ్రీకాంత్‌(22) నివ‌సిస్తున్నాడు. గురువారం అత‌డి అమ్మ‌మ్మ ద‌శ‌దిన క‌ర్మ కావ‌డంతో నిడ‌మ‌నూరు మండ‌లం రేగుల‌గ‌డ్డ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. ఆ కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం అత్త వీర‌మ్మ‌, మామ వెంక‌య్య‌ల‌తో క‌లిసి బండిపై ఇంటికి వెలుతున్నాడు.

అయితే.. మార్గ‌మ‌ధ్యంలో ఓ సుమో వీరి వాహానాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు రోడ్డుపై ప‌డిపోయారు. అత్త మామ‌లు ఓ వైపు ప‌డ‌గా.. శ్రీకాంత్ మ‌రో వైపుకు ప‌డ్డారు. వెంట‌నే సుమోలో నుంచి దిగిన ఆరుగురు శ్రీకాంత్‌ను హ‌త్య చేసేందుకు య‌త్నించారు. వారి నుంచి త‌ప్పించుకునేందుకు ప‌క్క‌నే ఉన్న వ‌రి పొలాల్లోకి ప‌రుగెత్తాడు శ్రీకాంత్. ఆ దుండ‌గులు అత‌డి వెంటప‌డి మెడ‌పై వేట‌కొడ‌లితో న‌రికారు. తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో అత‌డు అక్క‌డిక్క‌డే చ‌నిపోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. హ‌త్య‌కు పాల్ప‌డింది శ్రీకాంత్ సొంత పెద్ద‌మ్మ కొడుకు ఒంగూరి మహేంద‌ర్ అని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థారించారు. కుటుంబ క‌ల‌హాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. కాగా.. మ‌రో రెండు రోజుల్లో శ్రీకాంత్ తల్లి సంవ‌త్స‌రీకం జ‌ర‌గ‌నుంది. ఇంత‌లో ఈ ఘ‌ట‌న జ‌ర‌గడంతో వారి కుటుంబంలో విషాదం నెల‌కొంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Next Story
Share it