అభం శుభం తెలియని బాలురే అతడి టార్గెట్.. మాయమాటలు చెప్పి.. కోరిక తీర్చుకుని
Young Boy killed 3 boys in Tadepalli.ఓ కిరాతకుడు. అభం శుభం తెలియని బాలురపై కన్నేయడం కిడ్నాప్ చేసి వారిపై లైంగిక దాడి చేయడం అనంతరం వారిని దారుణంగా హత్య చేయడం అలవాటుగా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2021 1:24 PM IST
అతడు ఓ కిరాతకుడు. అభం శుభం తెలియని బాలురపై కన్నేయడం కిడ్నాప్ చేసి వారిపై లైంగిక దాడి చేయడం అనంతరం వారిని దారుణంగా హత్య చేయడం అలవాటుగా మారింది. గుంటూరు జిల్లా తాడపల్లిలో బాలుడి కిడ్నాప్, హత్య కేసును పోలీసులు చేధించారు. విచారణలో వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో పక్కపక్కనే ఉండే మెల్లంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు.
ఓ బాలుడు అదృశ్యమైన రెండో రోజే మృతదేహమై కనిపించడంతో తాడేపల్లి పోలీసులు ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెల్లంపూడి గ్రామంలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న కుర్ర భార్గవతేజ (6) అదృశ్యం కాగా అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్ గోపీ(19) అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా దిమ్మదిరిగే విషయాలను అతడు చెప్పాడు. ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లినట్టు చెప్పాడు. అనంతరం బాలుడి కాళ్లు, చేతులు కట్టేసి లైంగిక దాడి జరిపినట్లు తెలిపాడు. అనంతరం బాలుడిని తీవ్రంగా గాయపరిచి హత్య చేసి.. ఇంటి వెనుక ఉన్న అరటి తోటలో పడేసినట్లు అంగీకరించారు.
ఇదేవిధంగా మరో బాలుడినీ..
ఫిబ్రవరి 11వ తేదీన వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి మరియదాసు, మీనాక్షి కుమారుడు బండి అఖిల్ (8) మధ్యాహ్నం సమయంలో ఆడుకోవడానికి వెళ్లడు. తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని అఖిల్ అచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ కేసు గురించి గోపిని ఆరాతీయగా.. అఖిల్‌ను కూడా భార్గవతేజ తరహాలోనే మాయమాటలు చెప్పి వెంటబెట్టుకుని వెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుని, హత్య చేసినట్టు విచారణలో గోపీ ఒప్పుకున్నాడు.
నిందితుడు గోపీలో సైకో భావాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు 14 ఏళ్ల వయసులోనే తన స్నేహితుడి సెకండ్ షో సినిమాకి తీసుకువెళ్లి.. సినిమా మధ్యలో అతడిని బయటకు తీసుకువచ్చి లైంగిక దాడి చేసి చంపేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.