కత్తితో వచ్చిన ప్రియుడిపై ప్రియురాలు హత్యాయత్నం

వివాహేతర సంబంధాలు రెండు కుటుంబాలను చెల్లాచెదురు చేస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  10 Nov 2023 5:45 PM IST
yadadri,  crime, lady, murder attempt,  lover,

కత్తితో వచ్చిన ప్రియుడిపై ప్రియురాలు హత్యాయత్నం

వివాహేతర సంబంధాలు రెండు కుటుంబాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. ఈ సంబంధాల కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు అనాధలవుతున్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు పెడదారి పట్టడంతో ఆ కుటుంబంలో కల్లోలాలు చెలరేగడమే కాకుండా చివరకు ఎవరో ఒకరు హత్యకు గురి అవుతున్న ఘటనలు ఎన్నో మరెన్నో. బాగా చదువుకొని కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళ భర్తకు తెలియకుండా ప్రియుడితో ప్రేమాయణం కొనసాగించింది. భర్తకు విషయం తెలియడంతో ప్రియుడినే హత్య చేయడానికి పూనుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. శిల్ప అనే యువతి ఆత్మకూరు వ్యవసాయ శాఖ అధికారిణిగా పనిచేస్తుంది. మనోజ్ అనే వ్యక్తి యాదగిరిగుట్ట మండలంలోని మూసాయిపేట ఏఈఓగా పనిచేస్తున్నాడు. శిల్పకు సుధీర్ అనే వ్యక్తితో 2012లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు . అయితే గత రెండు సంవత్సరాల నుండి భర్తకు దూరంగా ఉన్న శిల్ప మనోజ్తో రిలేషన్షిప్ కొనసాగించింది. భర్తకు తెలియకుండా శిల్ప మనోజ్ తో ప్రేమాయణం కొనసాగిస్తూ ఉండడంతో ఈ విషయం కాస్త భర్తకు తెలిసింది. దీంతో దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇదిలా ఉండగా ప్రియుడు మనోజ్ గత నెల రోజుల క్రితం లీవ్ పెట్టి వెళ్లిపోయాడు.

ఒకవైపు ప్రియుడుతో ప్రేమాయణం విషయం తెలియడంతో భర్త విడాకులు ఇస్తానని అనడం... మరోవైపు ప్రియుడు మనోజ్ గత రెండు నెలలుగా కనిపించకపోవడంతో శిల్ప తీవ్ర మనస్థాపానికి గురైంది. తాజాగా మనోజ్ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చాడు. మనోజ్ ని చూడగానే శిల్ప తనను వదిలిపెట్టి ఎక్కడకు వెళ్లావ్ అంటూ ఆగ్రహంతో నిలదీసింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైనా మనోజ్ తన దగ్గర ఉన్న కత్తితో శిల్పను హత్య చేయడానికి ప్రయత్నించాడు. కానీ శిల్ప వెనువెంటనే అప్రమత్తమై అదే కత్తితో మనోజ్ పై దాడి చేసింది. ఈ దాడిలో మనోజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు మనోజ్‌ను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం మనోజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story