లాడ్జిలో మహిళ నగ్న మృతదేహం.. ఏం జరిగిందంటే?

Woman’s body found in lodge locked room in Patancheru. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఓ లాడ్జి గదిలో మంగళవారం ఉదయం గుర్తు తెలియన మహిళ నగ్న మృతదేహాన్ని

By అంజి  Published on  12 July 2022 12:05 PM IST
లాడ్జిలో మహిళ నగ్న మృతదేహం.. ఏం జరిగిందంటే?

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఓ లాడ్జి గదిలో మంగళవారం ఉదయం గుర్తు తెలియన మహిళ నగ్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భార్యాభర్తలమని చెప్పి సోమవారం మధ్యాహ్నం మహిళ, గణపతి అనే వ్యక్తి లాడ్జిలోకి వచ్చారు. సోమవారం రాత్రి 9 గంటలకు లాడ్జి గది నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం లాడ్జి నిర్వాహకులు గది తలుపు తట్టగా.. లోపల ఉన్న మహిళ తలుపు తీయలేదు. దీంతో లాడ్జి నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వెంటనే లాడ్జి నిర్వాహకులు డూప్లికేట్ కీతో గదిని తెరిచి చూడగా నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం కనిపించింది.

లాడ్జి నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భార్యాభర్తలు అతిగా మద్యం సేవించి ఉండటమే ఆమె మృతికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో ఆమెకు వాంతులు అయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. తెలిపారు. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతి చెందిన మహిళను గుర్తించడంతో పాటు, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Next Story