త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియ‌క‌.. 'అమ్మా ఫోన్ వ‌చ్చింది.. మాట్లాడ‌మ్మా'

Woman Sucide in Nagarkurnool.ఆ చిన్నారికి ఏం తెలుసు.. త‌ల్లి అనంత‌లోకాల‌కు వెళ్లిపోయింద‌ని. ఫోన్ రాగానే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2021 3:26 AM GMT
త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియ‌క‌.. అమ్మా ఫోన్ వ‌చ్చింది.. మాట్లాడ‌మ్మా

ఆ చిన్నారికి ఏం తెలుసు.. త‌ల్లి అనంత‌లోకాల‌కు వెళ్లిపోయింద‌ని. ఫోన్ రాగానే ఇంట్లోకి వెళ్లి దాన్ని తీసుకుని వ‌చ్చి.. అమ్మా ఫోన్ వ‌చ్చింది మాట్లాడూ అంటూ త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద పెట్టాడు. త‌ల్లి ఎంత‌కీ స్పందించ‌క‌పోవ‌డంతో పాపం ఆ చిన్నారి హృద‌యం త‌ల్ల‌డిల్లింది. ఈ దృశ్యం అక్క‌డున్న‌ వారిని చ‌లింప‌జేసింది.

వివ‌రాల్లోకి వెళితే.. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా లింగాలకు చెందిన సోమ‌శేఖ‌ర్‌కు, సూర్యాపేట జిల్లా నేరేడుచ‌ర్ల మండ‌లానికి చెందిన దివ్య‌(26) తో అయిదేళ్ల క్రితం వివామైంది. వీరికి మూడేళ్ల కుమారుడు జ్ఞాని విరాట్ సంతానం. భార్యాభ‌ర్త‌లు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పెళ్లైన త‌రువాత సోమ‌శేఖ‌ర్.. భార్య‌తో క‌లిసి ఉన్న‌త చ‌దువుల కోసం దుబాయ్ వెళ్లాడు. రెండు నెల‌ల క్రిత‌మే లింగాల‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల భార్య‌, కుమారుడిని త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఉంచి సోమ‌శేఖ‌ర్ దుబాయ్ వెళ్లిపోయాడు. ఈ క్ర‌మంలో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయి.

బుధ‌వారం మ‌ధ్యాహ్నాం అత్తామామ‌లు వ‌రండాలో కూర్చొని ఉండ‌గా దివ్య త‌న కుమారుడిని బ‌య‌ట‌కు పంపించింది. లోప‌ల నుంచి తాళం వేసుకుంది. ఫ్యానుకు చీర‌తో ఉరి వేసుకుంది. చిన్నారి విరాట్ ఏడుస్తూ త‌లుపు కొడుతున్నాడు. గ‌మ‌నించిన అత్తామామ‌లు చుట్టు ప్ర‌క్క‌ల వారి సాయంతో దివ్య‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. కాగా.. త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియ‌ని ఆ మూడేళ్ల చిన్నారి ఫోన్ రింగ్ కావ‌డంతో దాన్ని తీసుకుని వ‌చ్చి త‌ల్లికి అందించే ప్ర‌య‌త్నం చేయ‌డం అక్క‌డ ఉన్న‌వారంద‌రి చేత కంట‌త‌డి పెట్టించింది.

Next Story
Share it