Sangareddy: భర్తను చంపేందుకు ప్రయత్నం.. మహిళ, ప్రియుడు అరెస్టు

సంగారెడ్డిలో భర్తను చంపడానికి ప్రయత్నించిన కేసులో ఒక మహిళ, ఆమె ప్రియుడిని మార్చి 23 ఆదివారం అరెస్టు చేశారు.

By అంజి
Published on : 24 March 2025 11:37 AM IST

Woman, paramour held, husband, Sangareddy

Sangareddy: భర్తను చంపేందుకు ప్రయత్నం.. మహిళ, ప్రియుడు అరెస్టు

సంగారెడ్డిలో భర్తను చంపడానికి ప్రయత్నించిన కేసులో ఒక మహిళ, ఆమె ప్రియుడిని మార్చి 23 ఆదివారం అరెస్టు చేశారు. మునిపల్లి మండలం పెద్ద గోపులారం నివాసి అయిన కోషెడిపల్లి రవి అనే వ్యక్తి హరితను వివాహం చేసుకున్నాడు. అయితే హరిత మిరుదొడ్డి సాయి ప్రదీప్ అనే వ్యక్తితో సంబంధంలో ఉన్నట్లు సమాచారం. భర్త రవి తమ సంబంధానికి విఘాతం కలిగిస్తుండటంతో భార్య హరిత, భార్య ప్రియుడు సాయి ప్రదీప్‌లు.. అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు.

శనివారం పెద్ద గోపులారం వద్ద రవిని చంపే ప్రయత్నంలో సాయి ప్రదీప్, అతని స్నేహితుడు సాయి కిరణ్ రవి బైక్‌ను ఒక SUV తో ఢీకొట్టారు. రవి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రవి ఫిర్యాదు మేరకు సబ్-ఇన్‌స్పెక్టర్ రాజేష్ నాయక్ కామ్‌కోల్ టోల్ ప్లాజాలోని సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపు వివరాలను పరిశీలించి వాహనాన్ని గుర్తించారు. దర్యాప్తు ఆధారంగా హరిత ప్రదీప్ మరియు కిరణ్‌లను అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసి, ఆ రోజు సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు.

Next Story