దారుణం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు.. పెళ్లైన విషయం దాచడని..

ప్రేమ పేరుతో మోసం చేశాడన్న కోపంతో ఒక యువతి తన ప్రియుడిపై అత్యంత అమానవీయంగా దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది.

By -  అంజి
Published on : 28 Feb 2026 9:12 AM IST

Delhi Crime News, Wazirabad Incident, Relationship Betrayal, BNS Section 118, Hindu Rao Hospital, Safdarjung Hospital, Crime against men, Delhi Police Investigation

దారుణం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు.. పెళ్లైన విషయం దాచడని..

ప్రేమ పేరుతో మోసం చేశాడన్న కోపంతో ఒక యువతి తన ప్రియుడిపై అత్యంత అమానవీయంగా దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడి మర్మాంగాన్ని అతని ప్రియురాలు పదునైన ఆయుధంతో కోసేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన విసర్జీత్ (22) అనే యువకుడు ఒక క్వాక్ డాక్టర్ (సరైన అర్హత లేని వైద్యుడు). ఇతనికి వజీరాబాద్‌లో నివసించే అమీనా ఖాతూన్ అనే యువతితో గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

అయితే, విసర్జీత్‌కు అప్పటికే పెళ్లయిందనే విషయాన్ని అతను అమీనా దగ్గర దాచిపెట్టాడు. ఇటీవలే విసర్జీత్‌కు పెళ్లయిన విషయం అమీనాకు తెలిసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని గ్రహించిన ఆమె, అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 24న విసర్జీత్ ఢిల్లీకి వచ్చి అమీనా ఇంట్లోనే ఉన్నాడు. అదే రోజు రాత్రి ఆమె పాలల్లో మత్తుమందు కలిపి అతనికి ఇచ్చింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో విసర్జీత్ పాక్షిక స్పృహలో ఉండగా, అమీనా పదునైన ఆయుధంతో అతని మర్మాంగంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

తీవ్ర రక్తస్రావం అవుతున్న స్థితిలో విసర్జీత్ స్వయంగా హిందూ రావు ఆసుపత్రికి చేరుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతన్ని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి శస్త్రచికిత్స జరిగింది. విసర్జీత్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు అమీనాపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 118(2), 123 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉండగా, ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story