రెండో పెళ్లి చేసుకుంద‌ని రూ.11ల‌క్ష‌లు ఫైన్‌.. క‌ట్ట‌క‌పోవ‌డంతో

Woman married 2nd time panchayat imposes 11 lakhs fine.రాజస్థాన్‌ రాష్ట్రం లోని బార్మర్ జిల్లాలో ఓ మహిళ రెండో పెళ్లి

By M.S.R  Published on  16 Nov 2021 10:58 AM GMT
రెండో పెళ్లి చేసుకుంద‌ని రూ.11ల‌క్ష‌లు ఫైన్‌.. క‌ట్ట‌క‌పోవ‌డంతో

రాజస్థాన్‌ రాష్ట్రం లోని బార్మర్ జిల్లాలో ఓ మహిళ రెండో పెళ్లి చేసుకోవడం పంచాయతీ పెద్దలు రూ.11 లక్షల జరిమానా విధించారు. చెల్లించకపోవడంతో ఆమెను ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. పంచాయతీ పెద్దలు పెడుతున్న ఇబ్బందులను భరించలేక బాధితురాలు అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ను ఆశ్రయించింది. తమ సమాజంలోని పెద్దలు తన జీవితాన్ని కష్టతరం చేశారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసు సూపరింటెండెంట్‌కు వారి అనుచిత ప్రవర్తనను వివరించింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 18 నెలల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భర్త కూతురిపై అత్యాచారం చేశాడని, ఈ కేసులో జైలులో ఉన్నాడని ఆమె తెలిపింది. కూతురిపై అత్యాచారం చేసిన తర్వాత మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 18 నెలల క్రితం రెండో పెళ్లి చేసుకుంది. ఆమె రెండవ వివాహం తరువాత తమ సమాజంలోని పంచ్ మరియు పటేల్ సమాజ్ పెద్దలు ఆమె రెండవ వివాహంపై ఎన్నో విమర్శలు చేశారు. గత నెల 17వ తేదీన 35 మందికి పైగా కలిసి పంచాయితీ పెట్టారని, రూ.11 లక్షలు జరిమానా విధించారని మహిళ తెలిపింది.

బాధితురాలి రెండో భర్త కూడా తమకు చాలా కష్టంగా ఉందని.. గ్రామంలో బతకడం కష్టమైందని ఆరోపించారు. మేము రూ. 11 లక్షలు చెల్లించలేము, కాబట్టి మమ్మల్ని సంఘం నుండి బహిష్కరించారు. మా ఇంటికి ఎవరూ రాలేరు, వెళ్లలేరు. దీనిపై 17వ తేదీన సేద్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు. అక్కడ చర్యలు తీసుకోకపోవడంతో బార్మర్‌ పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశామన్నారు. తమకు ప్రాణహాని ఉందని ఆ జంట వాపోయింది.

Next Story
Share it