అధికారులను ఇంట్లోకి రానివ్వని మహిళ.. ఎందుకని తేలిందంటే?
పింఛను ప్రయోజనాల కోసం ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని కొన్నాళ్లపాటు ఇంట్లో దాచిపెట్టిందని తైవాన్ పోలీసులు చెబుతున్నారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2024 12:28 PM ISTఅధికారులను ఇంట్లోకి రానివ్వని మహిళ.. ఎందుకని తేలిందంటే?
పింఛను ప్రయోజనాల కోసం ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని కొన్నాళ్లపాటు ఇంట్లో దాచిపెట్టిందని తైవాన్ పోలీసులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం, కాహ్‌సియుంగ్ అనే నగరానికి చెందిన మహిళ తన తండ్రితో నివసించేది. అయితే ఆమె తండ్రి ఇటీవల మరణించాడు. ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు.
అయితే డెంగ్యూ నివారణ రసాయనాలను పిచికారీ చేసేందుకు అధికారులను ఆమె తన ఇంట్లోకి అనుమతించకలేదు. దీంతో ఆమెపై పోలీసుల అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఆమె తండ్రి మృతదేహం కనిపించింది. ఒక్కసారిగా షాక్ అయిన అధికారులు.. ఆమెకు NT $60,000 (సుమారు ₹1.5 లక్షలు) జరిమానా విధించారు. ప్రభుత్వ అధికారులను ఇంట్లోకి రానివ్వకుండా ఆమె నిరాకరించడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఆమె తండ్రి ఆచూకీ గురించి అధికారులు మహిళను ప్రశ్నించగా, ఆయన నర్సింగ్ హోమ్‌లో ఉన్నాడని ఆమె మొదట చెప్పింది. తన సోదరుడు అతన్ని వేరే ఊరికి తీసుకెళ్లాడని చెప్పుకొచ్చింది. ఇలా ఆమె మాటల్లో తేడాలు గమనించి విచారణ చేయగా అసలు విషయం బయట పడింది.
పోలీసులు మహిళ ఇంట్లో సోదాలు చేయగా, నల్లటి ప్లాస్టిక్ సంచిలో ఎముకలు కనిపించాయి. విచారణలో ఆమె అవి తన తండ్రివే అని ఒప్పుకుంది. 20 సంవత్సరాలకు పైగా సర్వీస్ లో ఉన్న ఆమె తండ్రి, ర్యాంక్, సర్వీస్ రికార్డ్ ఆధారంగా నెలవారీ పెన్షన్‌కు అర్హులు. తైవాన్ మిలిటరీలో ఒక అనుభవజ్ఞుడికి సగటు నెలవారీ పెన్షన్ NT $49,379 (దాదాపు ₹1.2 లక్షలు) ఉంటుంది. పెన్షన్ డబ్బులకు కక్కుర్తి పడి ఆమె ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని విచారణలో తెలుసుకున్నారు.