మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం.. ముగ్గురు ఆటో డ్రైవ‌ర్ల అరెస్ట్‌

Woman Gang Rape case Auto Drivers Remand.హిమాయ‌త్‌సాగ‌ర్ స‌మీపంలో ఓ మ‌హిళ పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Oct 2021 4:52 AM GMT
మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం.. ముగ్గురు ఆటో డ్రైవ‌ర్ల అరెస్ట్‌

హిమాయ‌త్‌సాగ‌ర్ స‌మీపంలో ఓ మ‌హిళ పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన నిందితుల‌ను రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. నిందితుల నుంచి ఆటోతో పాటు బాధితురాలి నుంచి తీసుకున్న రోల్డ్ గోల్డ్ చైన్‌, ప‌ర్సు, సెల్‌ఫోన్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. పురానాపూల్‌కు చెందిన ఓ వివాహిత‌(35) సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తోంది. ఆమెకు క‌ల్లు తాగే అల‌వాటు ఉండ‌డంతో హైద‌ర్‌గూడ‌లోని క‌ల్లు కాంపౌండ్‌లో క‌ల్లు తాగి వెళ్లేది. అలాగే ఈ నెల 13న సాయంత్రం కూడా క‌ల్లు తాగేందుకు హైద‌ర్‌గూడ‌కు వ‌చ్చింది. అదే స‌మ‌యంలో కూక‌ట్‌ప‌ల్లి వివేక్‌న‌గ‌ర్‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ నర్సింగ్‌రావు(32), జగద్గిరిగుట్టకు చెందిన నరేష్‌(31), బాలానగర్‌కు చెందిన ప్రసాద్‌(35) లు అక్క‌డికి వ‌చ్చారు. క‌ల్లు కాంపౌండ్‌లో వివాహిత‌తో మాటలు క‌లిపి ప‌రిచ‌యం పెంచుకున్నారు.

తాము కూడా మీ ఇంటి వైపున‌కే వెలుతున్నామ‌ని.. మీ ఇంటి ద‌గ్గ‌ర దింపేస్తామ‌ని ఆమెను న‌మ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. అత్తాపూర్ మీదుగా తిరిగి రాజేంద్ర‌న‌గ‌ర్ వైపు ఆటో వెలుతుండ‌డంతో ఆమె ఎక్కడికి తీసుకెలుతున్నార‌ని ప్ర‌శ్నించింది. హోట‌ల్‌లో బిర్యానీ తిని వెలుదామ‌ని చెప్పారు. అనంత‌రం హిమాయ‌త్‌సాగ‌ర్ లార్డ్స్ క‌ళాశాల వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి.. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి.. ఆమె వ‌ద్ద నున్న చైన్‌, ప‌ర్సు, సెల్‌ఫోన్‌ను తీసుకుని ఆటోలో పారిపోయారు. స్థానికుల సాయంతో ఆ మ‌హిళ అర్థ‌రాత్రి స‌మ‌యంలో రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుల‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Next Story