దోమ‌ల‌కు పొగ‌.. ఊపిరాడ‌క మ‌హిళ మృతి

Woman dies Suffocation Due for Mosquitoes.ఇంట్లో దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయ్‌. దోమ‌ల వ‌ల్ల రాత్రిళ్లు నిద్ర స‌రిగ్గా ఉండ‌డం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2021 4:21 AM GMT
దోమ‌ల‌కు పొగ‌.. ఊపిరాడ‌క మ‌హిళ మృతి

ఇంట్లో దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయ్‌. దోమ‌ల వ‌ల్ల రాత్రిళ్లు నిద్ర స‌రిగ్గా ఉండ‌డం లేదు. దీంతో దోమ‌ల‌ను త‌రిమేందుకు పొగ పొట్టారు. అయితే.. ఆ పొగ కార‌ణంగా భార్య మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. చెన్నై పమ్మల్‌ పొన్నియమ్మన్ వీధిలో చొక్కలింగం త‌న కుటుంబంతో క‌లిసి నివసిస్తున్నాడు. ఇత‌డు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇంట్లో దోమ‌లు విప‌రీతంగా ఉండ‌డంతో వాటిని త‌రిమేందుకు బుధ‌వారం రాత్రి ప్లేటులో బొగ్గులు ఉంచి పొగ‌పెట్టారు. అందులో కొంచెం నూనె కూడా పోసిన‌ట్లు తెలుస్తోంది. ఏసీ ఆన్ చేసి ప‌డుకున్నారు. పొగ ఇంటి నిండా మొత్తం క‌మ్ముకుంది. ద‌ట్ట‌మైన పొగ కారణంగా ఊపిరి ఆడ‌క చొక్కలింగం భార్య పుష్ప‌ల‌క్ష్మీ(53) నిద్ర‌లోనే మృతి చెందింది. గురువారం ఉద‌యం ఎంత‌సేప‌టికి వారి ఇంట్లో నుంచి ఒక్క‌రు కూడా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడ‌గా.. పుష్పలక్ష్మి మృతి చెందగా, మిగతా వారు స్ప్పహ తప్పి ఉన్నారు. వారిలో చొక్కలింగం, కుమార్తె మల్లిక, కుమారుడు విశాల్‌ను చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story