ఇష్టంగా తింటున్న కోడి గుడ్డు ప్రాణం తీసింది

Woman Dies after swallowing boiled Egg.జీవితం అనేది ఓ నీటి బుడ‌గ లాంటిది అని కొంద‌రు చెబుతుంటారు. నీటి బుడ‌గ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 9:54 AM GMT
ఇష్టంగా తింటున్న కోడి గుడ్డు ప్రాణం తీసింది

జీవితం అనేది ఓ నీటి బుడ‌గ లాంటిది అని కొంద‌రు చెబుతుంటారు. నీటి బుడ‌గ లాగానే మ‌న జీవితం కూడా ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. అదృష్టం లేకుంటే అర‌టి పండు తిన్నా ప‌న్ను ఊడిపోతుంద‌ట‌. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న న‌మ్మ‌లేన‌ట్లుగా ఉంది. ఇష్టంగా తింటున్న కోడి గుడ్డు కారణంగా ఓ ప్రాణం పోయింది. దీని గురించి విన్న వారంతా విస్మ‌యానికి గుర‌వుతున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాన్ని కాదనలేని పరిస్థితి. ఈ ఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

స్థానికులు చెప్పిన వివ‌రాల మేర‌కు.. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో నీల‌మ్మ‌(50) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. మంగ‌ళ‌వారం రాత్రి భోజ‌నం చేసేట‌ప్పుడు ఉడ‌క‌బెట్టిన గుడ్డును తినేందుకు య‌త్నించింది. గుడ్డును ముక్క‌లుగా కోయకుండా.. నోట్లో వేసుకుని కొరికేందుకు య‌త్నించ‌గా.. అది జారి గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిక‌రాడ‌క‌పోవ‌డంతో అక్క‌డిక్క‌డే కుప్ప‌కూలింది. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే గొంతులో ఇరుకున్న గుడ్డును బ‌య‌ట‌కు తీసే లోగా నీల‌మ్మ ప్రాణాలు కోల్పోయింది.

Next Story
Share it