నాలుగో సంతానం వద్దని.. భార్యకు అబార్షన్ మాత్రలు.. తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి

Woman dies after consuming abortion pills in Aurangabad. భర్త ఇచ్చిన అబార్షన్ మాత్రలు మింగి భార్య మృతి చెందిన ఘటన ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది.

By అంజి  Published on  25 Dec 2022 5:10 PM IST
నాలుగో సంతానం వద్దని.. భార్యకు అబార్షన్ మాత్రలు.. తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి

భర్త ఇచ్చిన అబార్షన్ మాత్రలు మింగి భార్య మృతి చెందిన ఘటన ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాలుగో సంతానం వద్దని భార్యకు భర్త అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్య గర్భం దాల్చింది. అయితే నాలుగో సంతానం వద్దని భార్యకు అబార్షన్ మాత్రలు ఇచ్చాడు కూలీ భర్త. కానీ ఎంత డోస్‌ ఇవ్వాలో తెలియక మాత్రలు ఓవర్ డోస్ కావడంతో భార్యకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఫులంబ్రి తాలూకాలోని రైల్‌గావ్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరణించిన మహిళ వైశాలి బాలాసాహెబ్ క్షీరసాగర్ (30), ఆమె భర్త పేరు బాలాసాహెబ్ గణపత్ క్షీరసాగర్. వీరికి ముగ్గురు పిల్లలు. తన భార్య నాలుగోసారి గర్భవతి కావడంతో ఆందోళన చెందాడు. ఈ బిడ్డ వద్దనుకోవడంతో నిబంధనల ప్రకారం భార్యను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయాలని భావించాడు. అయితే అలా చేయకుండా మందుల దుకాణం నుంచి అబార్షన్ మాత్రలు తెచ్చాడు. అయితే ఈ మాత్రలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. భార్యకు ఏకంగా నాలుగైదు మాత్రలు ఇచ్చాడు. ఈ మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే వైశాలికి రక్తస్రావం మొదలైంది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను ఫూలంబ్రిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో వైశాలిని ఔరంగబద్లా వ్యాలీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వైశాలి మృతి చెందింది. ఈ కేసులో ఫూలంబ్రి పోలీసులు కేసు నమోదు చేసి బాలాసాహెబ్ క్షీరసాగర్‌ను అరెస్టు చేశారు.

Next Story