అదనపు కట్నం వేధింపులు.. ఆమె ఎంత పని చేసిందంటే?
ఆడపిల్ల పుట్టిందని వేధించడం.. అదనపు కట్నం కోసం హింసించడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. పె
By అంజి Published on 4 Aug 2023 1:14 AM GMTఅదనపు కట్నం వేధింపులు.. ఆమె ఎంత పని చేసిందంటే?
ఆధునికత పెరిగినా మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. వరకట్న వేధింపులకు తెరపడట్లేదు. ఆడపిల్ల పుట్టిందని వేధించడం.. అదనపు కట్నం కోసం హింసించడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. పెళ్లై రెండేళ్లు కూడా గడవకముందే కట్నం కాపురంలో చిచ్చు పెడుతోంది. చివరకు వారి ప్రాణాలను బలితీసుకునేదాకా ఆ పరిస్థితులు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్‌తో సంధ్యారాణికి సంవత్సరం క్రితం వివాహం జరిగింది. పెద్దల సమక్షంలో పెళ్లి కోసమని, వరకట్నం కింద మూడు లక్షల పదివేలు క్యాష్ , పది తులాల బంగారం, ఫర్నిచర్ ఇచ్చారు.
అయితే పెళ్ళికొడుకు ప్రవీణ్ కుమార్ హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో పెళ్లయిన రెండు నెలలకే హైదరాబాద్ వచ్చి కాపురం పెట్టారు. కొద్దిరోజులు బాగానే ఉన్నారు. అంతలోనే అదనంగా వరకట్నం కావాలని సంధ్య రాణిని వేధించడం మొదలు పెట్టాడు. ఈ విషయం అమ్మాయి తల్లికి చెప్పగా అదనంగా వరకట్నం ఇవ్వలేనని అల్లుడితో చెప్పింది. అదనంగా వరకట్నం ఇవ్వకపోవడంతో భార్య పట్ల క్రూరంగా భర్త వ్యవహరించాడు. అతని వేధింపులు భరించలేక సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది విషయం తెలుసుకున్న సంధ్యారాణి తల్లి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు.