33 గంట‌లు మృత్యువుతో పోరాడి ఓడిన ముంబై బాధితురాలు

Woman brutally raped in Mumbai Dies.ముంబై న‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. 32 ఏళ్ల మ‌హిళ‌పై అత్యంత కిరాత‌కంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2021 8:02 AM GMT
33 గంట‌లు మృత్యువుతో పోరాడి ఓడిన ముంబై బాధితురాలు

ముంబై న‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. 32 ఏళ్ల మ‌హిళ‌పై అత్యంత కిరాత‌కంగా లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. అత్యాచారం చేసిన అనంత‌రం బాధితురాలి ర‌హ‌స్య భాగాల‌పై రాడ్డుతో దాడి చేసిన అనంత‌రం న‌డి రోడ్డుపైనే వ‌దిలి వెళ్లారు ఆ న‌ర‌రూప రాక్ష‌సులు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం ఉద‌యం మృతి చెందింది. దాదాపు 33 గంట‌ల పాటు మృత్యువుతో పోరాడిన‌ప్ప‌టికి .. చివ‌రికి ఓడిపోయింది.

వివ‌రాల్లోకి వెళితే.. ముంబైలోని సాకినాక ప్రాంతంలోని ఖైరానీ ర‌హ‌దారిపై ఓ మ‌హిళ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న‌ట్లు పోలీస్ ప్ర‌ధాన కాల్‌సెంట‌ర్‌కు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 3.30గంట స‌మ‌యంలో స‌మాచారం రావ‌డంతో వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు పోలీసులు. తీవ్ర‌గాయాల‌తో ప‌డి ఉన్న‌ బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అయితే..ప‌రిస్థితి విష‌మించ‌డంతో బాధితురాలు శ‌నివారం ఉద‌యం మ‌ర‌ణించింది.

ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా బావిస్తోన్న మోహ‌న్ చౌహ‌న్‌(45) అనే వ్య‌క్తిని అరెస్టు చేశారు. మ‌రికొంద‌రి పాత్ర ఉండొచ్చున‌ని పోలీసులు బావిస్తున్నారు. రోడ్డు ప‌క్క‌న ఉన్న టెంపో వాహ‌నంలో మ‌హిళ‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌ని.. అందులోనూ ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it