కడప జిల్లాలో మహిళ దారుణ హత్య
Woman Brutally Murder in Kadapa District.కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. అందరూ చూస్తుండగానే
By తోట వంశీ కుమార్ Published on
1 Dec 2021 7:20 AM GMT

కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పులివెందులలో జరిగింది. పులివెందుల మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో మహిళను ఓ దుండగుడు దారణంగా పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలిని పులివెందుల ప్రాంతానికి చెందిన రిజ్వానగా గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని ఆమె ప్రియుడే హత్య చేసినట్లుగా పోలీసులు బావిస్తున్నారు. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story