భార్య వేరే వ్యక్తితో మాట్లాడిందని.. నడి రోడ్డుపై దారుణంగా
Woman beaten by husband in at Alirajpur Districtవివాహాబంధానికి నమ్మకమే పునాది.. అనుమానమే సమాధి.. అని పెద్దలు
By తోట వంశీ కుమార్ Published on 14 Sept 2021 11:21 AM ISTవివాహాబంధానికి నమ్మకమే పునాది.. అనుమానమే సమాధి.. అని పెద్దలు అంటుంటారు. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. ఆమె ఓ యువకుడితో మాట్లాడుతూ కనిపించడంతో దారుణంగా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై భార్యను దారుణంగా కొట్టాడు. ఆమె దుస్తులు చిగిరిపోయిన కనికరం లేకుండా చావబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో అలీరాజ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. అలిరాజ్‌పూర్ జిల్లాలోని సోండ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్లి గ్రామానికి వ్యక్తితో బాధితురాలికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో బాధిత మహిళ తన సోదరి ఇంటికి వెలుతోంది. దారిలో ఆమెకు తెలిసిన ఓ యువకుడు కనిపించాడు. దీంతో వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో ఆమె భర్త ఇది చూసి ఆగ్రహాంతో ఊగిపోయాడు. ఇద్దరు స్నేహితలతో వారివద్దకు వచ్చి.. భార్యను, యువకుడిని కొట్టడం ప్రారంభించాడు. అక్కడికి అత్త కూడా వచ్చింది. ఆమె కూడా కొడుకుకే వతాసు పలుకుతూ.. కోడలిపై దాడికి దిగింది. ఈ క్రమంలో మహిళ దుస్తులు చిరిగిపోయాయి. అయినప్పటికి వివస్త్రగా ఉన్న ఆమెను అలాగే దారుణంగా కొడుతూనే ఉన్నారు.
ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. చివరికి పోలీసులకు తెలిసింది. మహిళపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.