దారుణం.. ప్రియుడిని చంపి.. అతడి ప్రైవేట్ భాగాలతో బిర్యానీ
Woman allegedly kills boyfriend serves his genitals in meal. ఓ మహిళ తన ప్రియుడిని దారుణంగా హత్య చేసి.. అతడి శరీరరంలో ప్రైవేటు బాగాలతో బిర్యాని వండింది.
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2021 7:43 PM IST
ఉత్తర ఆఫ్రికాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడిని దారుణంగా హత్య చేసి.. అతడి శరీరరంలో ప్రైవేటు బాగాలతో బిర్యాని వండింది. అనంతరం ఆ బిర్యానీని ఇంటి పక్కన భవన నిర్మాణ పనులు చేసుకుంటున్న కార్మికులకు పెట్టింది. విషయం తెలియని వారు ఆ బిర్యానీని తిన్నారు. ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో 30ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమె ఏడేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుంది.
ఇటీవల అతడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయం తెలిసిన ఆ మహిళ.. ప్రియుడితో గొడవకు దిగింది. వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించేది లేదని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. ఆ గొడవలో ప్రియుడిని చంపేసింది. హత్య విషయం బయటకు రాకుండా ఉండేందుకు అతడి శరీరాన్ని మాయం చేయాలని అనుకుంది. అతడి శరీరంలోని అంగం, వృషణాలు కోసి బిర్యానీ వండింది. మిగతా శరీర బాగాలను కుక్కలకు ఆహారంగా వేసింది.
ఇక బిర్యానీని ఆమె ఇంటి సమీపంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్న కూలీలకు పెట్టింది. ఈ విషయం తెలియని వారు అది మాంసంతో చేసిన బిర్యానీనే అనుకుని తినేశారు. కొద్ది రోజుల నుంచి ఆ వ్యక్తి ఇంటికి రాకపోవడంతో పాటు అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళపై అనుమానం వ్యక్తం చేయడంతో.. ఆ మహిళ ఇంటికి పోలీసులు వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మిక్సీలో పోలీసులకు దంతాలు కనిపించాయి. వాటిని పరీక్షించగా.. మృతుడివే అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మొత్తం విషయం చెప్పింది. ఈ విషయం విన్న పోలీసులు దెబ్బకు షాకయ్యారు. ఆమె మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు ఆస్పత్రికి తరలించారు.