హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సహారా రోడ్డులోని వివేకానందనగర్ కాలనీలో గగన్ అగర్వాల్(38) అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. రెండేళ్ల క్రితం భార్యకు విడాకులు ఇచ్చాడు. గతేడాది జూలైలో పాత బస్తీకి చెందిన నౌసిన్ బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. అంత సవ్వంగానే ఉందనుకుంటున్న క్రమంలో ఫిబ్రదరి 8వ తేదీ నుంచి గగన్ కనిపించకుండా పోయాడు. తన భర్త కనిపించడం లేదని నౌసిన్, గగన్ సోదరుడు ఎల్బీనగర్ పోలీసులకు ఆశ్రయించి మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఈ కేసు వనస్థపలిపురం స్టేషన్ పరిధిలోకి రావడంతో ఎల్బీనగర్ పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. కేసు నమోదు చేసిన తరువాత నౌసిన్బేగం తన పుట్టింటికి వెళ్లిపోయింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నౌసిన్ ను విచారించారు. ఈ క్రమంలో నౌసిన్ పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ఆమెను విచారించగా.. అసలు నిజం చెప్పింది. తన భర్తను తానే హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు వెల్లడించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే వారి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు.