మంట‌ల్లో కాలిపోతున్న భార్య‌.. వీడియో తీస్తూ రాక్ష‌సానందం పొందిన భ‌ర్త‌

Wife burning in flames .. అగ్ని సాక్షిగా పెళ్లాడాడు. ఆ అగ్నికే భార్య ఆహూతి అవుతుంటే కాపాడాల్సిన భ‌ర్త‌.. వీడియో తీశాడు.

By సుభాష్  Published on  27 Nov 2020 12:06 PM IST
మంట‌ల్లో కాలిపోతున్న భార్య‌.. వీడియో తీస్తూ రాక్ష‌సానందం పొందిన భ‌ర్త‌

అగ్ని సాక్షిగా పెళ్లాడాడు. ఆ అగ్నికే భార్య ఆహూతి అవుతుంటే కాపాడాల్సిన భ‌ర్త‌.. వీడియో తీశాడు. మంట‌ల‌కు తాళ‌లేక భార్య చేసే ఆర్త‌నాలు వింటూ.. హా చావవే అంటూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ రాక్షసానందం పొందాడు. ఈ హృద‌య విదార‌క‌ర ఘ‌ట‌న రాజస్తాన్ లోని ఝలావర్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మనీషా కుమారి, అనిల్ కుమార్ ల‌కు 2012లో వివాహ‌మైంది. వీరిద్ద‌రు సికార్ న‌గ‌రంలో నివాసం ఉంటున్నారు. కొంత కాలం బాగానే ఉన్న‌ప్ప‌టికి ఆ త‌రువాత అత్తింటి వారి వేధింపులు ఎక్కువ‌య్యాయి. వేధింపుల‌కు తాళ‌లేక మ‌నీషా.. 2019లో భర్త, ఇతర కుటుంబ సభ్యులపై గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు అత్తింటివారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ తరువాత కూడా మనీషాపై అత్తింటివారు వేధింపులు మానలేదు.

దీంతో విసిరివేసారిన మ‌నీషా.. నవంబర్‌ 20న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త.. భార్యను అడ్డుకోవాల్సింది పోయి తన ఫోన్ లో వీడియో తీస్తూ రాక్షసానందం పొందాడు. ''చావవే చావు నీ పీడ నాకు ఈరోజుతో పోతుంది''అంటూ వీడియో తీస్తూ పైశాచికానందం పొందాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు జైపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 22న మృతి చెందింది.

భార్య కాలిపోతుంటే వీడియో తీసిన ఆ భర్త ఆ వీడియోను పలువురికి షేర్ చేశాడు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మనీషా సోదరుడు ఆ వీడియోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మనీషా భ‌ర్త‌, అత్త‌మామ‌ల అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Next Story