దారుణం.. భార్య, మామ గొంతు కోసి హత్య
Wife and Uncle Brutal murdered in Karimnagar District.ఓ దుర్మార్గుడు.. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య,
By తోట వంశీ కుమార్ Published on 20 July 2021 9:15 AM ISTఓ దుర్మార్గుడు.. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన మామను వెంటాడి మరీ దారుణంగా హతమార్చాడు. తన సోదరుడి సాయంతో వారిద్దరి గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్ గుట్ట సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దికి గ్రామానికి చెందిన లావణ్య(34), అన్నారానికి చెందిన గుడాల రమేశ్‌కు కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్ ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో లావణ్య రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. తన భర్తపై కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ దంపతులిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయమై రమేశ్ తీవ్ర మనస్థాపం చెందాడు. సోమవారం రాత్రి భార్య లావణ్య, మామ ఓదేలు (60) కుమారుడు అజిత్, కుమార్తె అక్షిత ఆటోలో వెల్దికి వస్తున్నారు. విషయం తెలుసుకున్న రమేశ్.. సోదరుడితో కలిసి బైక్ పై వారిని వెంబడించాడు. ఆటోను ఆపి భార్య, మామపై దాడి చేసి కత్తితో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తండ్రిని అడ్డుకోబోయిన కుమారై చేతికి గాయమైంది. హత్య చేసిన అనంతరం నిందితులిద్దరూ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.