వరంగల్ విద్యార్థిని లండన్‌లో ఆత్మహత్య

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వరంగల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చదువు పూర్తికాకుండానే ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on  25 May 2023 9:15 PM IST
Warangal student, suicide, London

వరంగల్ విద్యార్థిని లండన్‌లో ఆత్మహత్య

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన వరంగల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చదువు పూర్తికాకుండానే ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ నగరంపోచమ్మమైదాన్‌ ప్రాంతానికి చెందిన బస్వరాజు విజయ, రమేశ్‌ దంపతుల కుమార్తె బస్వరాజు శ్రావణి (27) లండన్‌లోని బ్లూమ్స్‌బరీ ఇనిస్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ (మేనేజ్‌మెంట్‌) కోర్సు చదివేందుకు వెళ్లింది. శ్రావణి తండ్రి రమేశ్‌ లారీ డ్రైవర్‌ కాగా తల్లి విజయ గృహిణి. లండన్‌లో చదువుతున్న శ్రావణి గత సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి లండన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో శ్రావణి ఆత్మహత్యకు యత్నించి ఉండవచ్చని యూకే ఎన్‌ఆర్‌ఐ ఫోరం అధ్యక్షుడు శ్రీధర్‌ నీలా తెలిపారు. లండన్‌లోని ఎన్‌ఆర్‌ఐ ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్‌, ఫౌండర్‌ కిరణ్‌, జాయింట్‌ సెక్రటరీ ప్రవీణ్‌, ఉమెన్‌ వింగ్‌ సెక్రటరీ మేరీ లండన్‌లోని ఇండియా ఎంబసీ అధికారులతో సంప్రదించి ఆమె మృతదేహాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఫోరం తరుపున రూ.30 లక్షలు ఆర్థిక సాయం అందించారు.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story