ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడిన ఓ కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాలో ఈ ఘటన చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తనను పెళ్లి చేసుకుంటానని కార్పొరేటర్ భర్త శిరీష్ ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి మిల్స్ కాలనీ పోలీసులకు సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. కార్పొరేటర్ భర్తపై అత్యాచారం నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు.
అప్పటి నుంచి శిరీష్ పరారీలో ఉన్నాడు. శిరీష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో గాలించిన పోలీసులు గురువారం అర్థరాత్రి శిరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ను విధించారు. అనంతరం నిందితుడిని పరకాల జైలుకు తరలించారు. కాగా.. ఈ ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.