విశాఖలో దారుణం.. తహసీల్దార్‌ను ఇనుపరాడ్డుతో కొట్టి హత్య
విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తహసీల్దార్‌పై దాడి చేశారు.
By Srikanth Gundamalla
విశాఖలో దారుణం.. తహసీల్దార్‌ను ఇనుపరాడ్డుతో కొట్టి హత్య
విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తహసీల్దార్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తహసీల్దార్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
చినగదిలి రూరల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రమణయ్య కొమ్మాదిలోని చరణ్ క్యాస్టర్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే.. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తం అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చాడు. రమణయ్య కూడా అతని వద్దకు వచ్చాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. దాంతో.. సదురు వ్యక్తి అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న ఐరన్ రాడ్డుతో రమణయ్యపై దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడి సంఘటనలో తహసీల్దార్ రమణయ్య తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అయితే.. దుండగుడు దాడి చేసి పారిపోతున్న క్రమంలో అతడిని పట్టుకునేందుకు అపార్ట్‌మెంట్ వాసులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న ప్రయివేట్ ఆస్పపత్రికి తరలించారు. అక్కడ రమణయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రమణయ్య ఇంతకుముందు విశాఖ రూరల్ తహసీల్దార్‌గా పనిచేశారు. ఆయన విధుల పట్ల చాలా నిజాయితీగా ఉంటారని ఇతరులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనాస్థలాన్ని నగర సీపీ పరిశీలించారు. అలాగే కలెక్టర్, సీపీలు ఆస్పత్రికి వెళ్లి అక్కడ ఆరా తీశారు. తహసీల్దార్ రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కాగా.. ఆయనకు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.