ఔను.. వేధించాను.. ఇంతదాకా వస్తుందని అనుకోలేదు

Vinod Jain has pleaded guilty molestation minor girl.విజ‌య‌వాడ‌లో సంచ‌ల‌నం రేపిన బాలిక ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 7:55 AM GMT
ఔను.. వేధించాను.. ఇంతదాకా వస్తుందని అనుకోలేదు

విజ‌య‌వాడ‌లో సంచ‌ల‌నం రేపిన బాలిక ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఈ కేసులో అరెస్టైన వినోద్ కుమార్ జైన్ ను పోలీసులు ప్ర‌శ్నించారు. కాగా.. పోలీసుల ఎదుట జైన్ నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. బాలిక ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఒప్పుకున్నాడు. అయితే.. బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకునేంత వ‌ర‌కు ఈ ఘ‌ట‌న వెలుతుంద‌ని ఊహించ‌లేద‌ని పోలీసుల‌తో చెప్పాడ‌ట‌.

బాలిక‌ను తాక‌రానిచోట తాకుతూ వికృతానందం పొందేవాడిన‌ని అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజిలో నిందితుడి వికృతచేష్టలు, బాలిక ఆత్మ‌హ‌త్య దృశ్యాలు రికార్డు అయ్యాయి. బాలిక పాఠ‌శాల‌కు వెళ్లేట‌ప్పుడు, వచ్చేప్పుడు అపార్ట్‌మెంట్‌లో మెట్లు ఎక్కే సమయంలో, దిగే సమయంలో, లిఫ్ట్ వద్ద బాలికను వేధించినట్లు అంగీక‌రించాడు. బాలిక కు స‌న్నిహితంగా మెలిగేందుకు ప్ర‌య‌త్నించాన‌ని.. బాలికను తాకుతూ తాను ఆనందం పొందేవాడినని చెప్పాడ‌ట‌.

విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బెంజి సర్కిల్‌ వద్ద ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. తన ఆత్మహత్యకు గత కారణాలను వివరిస్తూ బాలిక సూసైడ్ నోట్ రాసింది.

తెలుగు దేశం పార్టీ నాయకుడు వినోద్‌ జైన్‌ (55) వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక తెలిపింది. సూసైడ్ నోట్‌లో దిగ్భ్రాంతికర విష‌యాలను వెల్ల‌డించింది. 'వినోద్‌ జైన్ బుగ్గలు గిల్లేవాడు. ఛాతీ, తొడలు, ఇతర ప్రదేశాల్లో చేతులు వేసేవాడు. నువ్వు చాలా అందంగా ఉంటావంటూ టీజ్‌ చేసేవాడు. జీన్‌ ప్యాంటు వేసుకుంటే మరింత అందంగా ఉంటావని అనేవాడు. అన్ని విషయాలూ మీతో షేర్‌ చేసుకునే నేను.. ఈ వేధింపులను మీకు చెప్పడానికి షేమ్‌గా ఫీల్‌ అవుతున్నాను.

అమ్మా.. నేనీ విషయాన్ని మొదట్లోనే చెప్పలేదు. చాలా భయపడ్డా. సిగ్గుగా భావించా. జీవితంలో ఇంకేదైనా సమస్య వస్తే చనిపోయేదాన్ని కాదేమో! ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాను. దీనంతటికీ కారణం వినోద్‌జైన్‌. రెండు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ నా శరీరాన్ని తాకుతున్నాడు. మన ఫ్లాట్‌కు వచ్చీపోయేటప్పుడు లిఫ్ట్‌, మెట్ల దగ్గర అసభ్యంగా మాట్లాడుతూ, శరీర భాగాలను తాకేవాడు. అతని చర్యల పట్ల ఎంతో భయాందోళనకు గురయ్యాను. ఈ విషయాన్ని నేను హ్యాండిల్‌ చేయలేక పోతున్నాను. నా జీవితంలో ఇదే అతి పెద్ద సమస్య. మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు. తప్పని పరిస్థితి వచ్చింది. అందుకే చనిపోతున్నాను. తమ్ముడు, మీరంతా జాగ్రత్త' అని బాలిక సూసైడ్‌ నోట్‌లో రాసింది.

Next Story