మహిళను వేధిస్తున్నాడని కిడ్నాప్, ఆ తర్వాత మూత్రం తాగించి..
విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 6:33 AM ISTమహిళను వేధిస్తున్నాడని కిడ్నాప్, ఆ తర్వాత మూత్రం తాగించి..
విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళకు ఒక వ్యాపారవేత్త అసభ్యకరమైన వీడియోలు షేర్ చేస్తున్నాడని కోపంతో కొందరు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతన్ని కారులో ఎక్కించుకుని మూత్రం తాగించి.. దాడి చేశారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని విజయనగరం వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వన్ టౌన్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. రాజస్థాన్ నుంచి ఒ వ్యాపారి విజయనగరం వచ్చాడ. నగరంలో స్టీల్, స్టౌ మెటీరియల్ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే.. రాజస్థాన్‌లోని అదే గ్రామానికి చెందిన బిజలా రాం, మరికొందరు ఈ నెల 14న విజయనగరం వచ్చాడరు. వ్యాపారితో మాట్లాడేందుకు పిలిచి అతన్ని కారులో ఎక్కించుకున్నారు. వై-కూడలి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కాసేపు మాట్లాడిన తర్వాత .. మద్యం కొనుగోలు చేసి కలిసి తాగారు. ఈ క్రమంలోనే తమ ఇంట్లోని ఆడవారికి అసభ్యకర వీడియోలను షేర్ చేస్తున్నాడని నెపంతో వ్యాపారిని సదురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత బాటిళ్లలో మూత్రం సేకరించి.. దాన్ని తాగించారు. ఆ తర్వాత తీవ్రంగా కొట్టారు. వ్యాపారి స్నేహితుడికి కాల్ చేయించి.. రూ.35వేలు బలవంతంగా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత వ్యాపారని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు నిందితులు.
అయితే.. వ్యాపారి విజయనగరంలోని నివాసానికి వచ్చాడు. కొద్దిరోజుల పాటు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఉన్నాడు. కానీ.. నిందితలు రాజస్థాన్ వెళ్లాక.. వ్యాపారికి మూత్రం తాగించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అది ఇతనికి తెలియడంతో జూన్ 22న వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడైన దేవాసీ నజీరాంను అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితులు బిజలా రాం, దిలీప్‌లను కూడా త్వరలోనే పట్టుకుంటామని సీఐ వెంకట్రావు చెప్పారు.