బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్

మహిళలు, బాలికపై అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 Aug 2024 6:46 AM IST
Uttarakhand, gang rape,  minor girl,  bus, five arrested ,

బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం, ఐదుగురు అరెస్ట్ 

మహిళలు, బాలికపై అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో డాక్టర్ పై హత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే..తాజాగా మరో దారుణ సంఘటన జరిగింది. ఉత్తరాఖండ్‌లో ఒక బస్సులో బాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తారఖండ్‌లోని డెహ్రాడూన్‌లో అంతర్‌రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఉగివున్న ఢిల్లీ-డెహ్రాడూన్‌ బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12వ తేదీన ఈ సంఘటన జరిగింది. శనివారం ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. సంఘటన జరిగిన ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, కండక్టర్‌ ఉన్నారని పోలీసులు తెలిపారు.

కాగా.. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతర్రాష్ట బస్‌ టెర్మినల్‌ 12వ నంబరు ప్లాట్‌ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉందని.. జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందింది. దాంతో.. కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్‌కు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్‌ ఇవ్వగా బాలిక జరిగిన సంగతిని వివరించింది. డెహ్రాదూన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌సింగ్‌ బాధితురాలితో మాట్లాడారు. బాలిక మొరాదాబాద్‌ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి డెహ్రాదూన్‌కు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బస్సు దేహ్రాదూన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక తొలుత డ్రైవర్, కండక్టర్‌ అఘాయిత్యానికి పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.ఆ తర్వాత పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు ఇద్దరు, ఆ తర్వాత బస్టాండ్‌లోని క్యాషియర్‌ కూడా అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేల్చారు పోలీసులు.

Next Story