దారుణం.. రైలులో యువతిపై TTE అత్యాచారం
అహ్మదాబాద్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. ఎన్‌సీసీ క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై టీటీఈ రాహుల్ అత్యాచారం చేశాడు.
By - అంజి |
దారుణం.. రైలులో యువతిపై TTE అత్యాచారం
అహ్మదాబాద్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. ఎన్‌సీసీ క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై టీటీఈ రాహుల్ అత్యాచారం చేశాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమె టికెట్ తీసుకోకుండా ఏసీ కోచ్ ఎక్కింది. దీంతో సీటు ఇప్పిస్తానని చెప్పి టీటీఈ క్యాబిన్‌కు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన ఒక యువతి, రైలు ప్రయాణంలో తనకు రక్షణగా ఉండాల్సిన టికెట్ కలెక్టరే తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఫిబ్రవరి 15న చోటుచేసుకుంది. బాధితురాలు మౌ జిల్లా నుండి గోరఖ్‌పూర్ వెళ్లేందుకు రైలు ఎక్కారు. రైలు ప్రయాణంలో ఉండగా, నిందితుడైన TTE ఆమెపై అత్యాచార యత్నం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఘటన తర్వాత బాధిత యువతి గోరఖ్‌పూర్ రైల్వే పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ప్రాథమికంగా గోరఖ్‌పూర్ జీఆర్‌పీ కేసు నమోదు చేసినప్పటికీ, ఈ నేరం డియోరియో ప్రాంత పరిధిలో జరిగినట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం, ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం డియోరియో జీఆర్‌పీకి బదిలీ చేశారు. నిందితుడైన TTEపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. రైల్వే పోలీసులు రైలులోని ఇతర ప్రయాణికులను, సాక్షులను విచారిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రైల్వే శాఖ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి అంతర్గత విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.