దారుణం.. మహిళపై భర్త సోదరుడి అత్యాచారం, హత్యాయత్నం

రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  28 April 2024 7:27 AM IST
uttar pradesh, rape, husband, brother,

 దారుణం.. మహిళపై భర్త సోదరుడి అత్యాచారం, హత్యాయత్నం

రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా మహిళను బయటకు పంపాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. అంతేకాదు.. కొందరు కామాంధులు అయితే వావివరుసలు మరిచి సొంతవారిపైనే దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోదరుడి భార్యపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఆలస్యంగా బయటకు వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2వ తేదీన భర్త ఇంట్లో లేని సమయంలో ఓ మహిళపై భర్త సోదరుడు అత్యాచారం చేశాడు. అయితే.. భర్త ఇంటికి తిరిగి వచ్చాక.. ఈ ఘోరం గురించి బాధిత మహిళ భర్తతో చెప్పింది. అత్యాచారం చేసిన వీడియోను కూడా చిత్రీకరించాడని వాపోయింది. ఇది విన్న తర్వాత ఆ భర్త తన సోదరుడిని నిలదీయకుండా.. సదురు మహిళపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాక్షసుడిలా ప్రవర్తించాడు. మహిళను కొట్టి ఆమెపై కూర్చొని గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఇక నుంచి ఇద్దరం భార్యాభర్తలం కాదనీ.. వదిన అవుతావు అంటూ చెప్పాడు.

అయితే.. ఈ సంఘటన జరిగిన తర్వాత రోజే బాధిత మహిళ గదిలోకి భర్త, అతని సోదరుడు కలిసి వెళ్లారు. దుపట్టాతో ఆమె గొంతు పిసికి చంపేయాలని తన భర్త ప్రయత్నించాడు. హత్య చేస్తుండగా దీన్ని భర్త సోదరుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు. ప్రతిఘటించిన మహిళ వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతని సోదరుడిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఖతౌలీ కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. హత్యాయత్నం వీడియోను కూడా పోలీసులకు సదురు బాధితురాలు అందించిందని తెలుస్తోంది.

Next Story