మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతం

మహిళా కానిస్టేబుల్‌పై తీవ్రంగా దాడిచేసిన నిందితుల్లో ఒకరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  22 Sep 2023 6:18 AM GMT
Uttar pradesh, accused,  attacking woman cop, encounter,

మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతం

ఆగస్టు 30న ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రైలులో సీటు గొడవలో భాగంగా మహిళా కానిస్టేబుల్‌పై కత్తితో ముగ్గురు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయోధ్యలో లక్నో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునే క్రమంలో నిందితులపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో నిందితుల్లో ఒకడైన అనీశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయమే ఈ ఎన్‌కౌంటర్‌ సంఘటన చోటుచేసుకుంది.

ఆగస్టు 30న అసలు ఏం జరిగిందంటే.. అయోధ్య రైల్వే స్టేషన్‌లో సరయు ఎక్స్‌ప్రెస్‌ కంపార్ట్‌మెంట్‌లో సీటు విషయంలో మహిళా కానిస్టేబుల్‌తో ముగ్గురు వ్యక్తులు అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్‌, అనీశ్ మధ్య గొడవ మొదలైంది. మాటా మాటా పెరిగి వివాదం కాస్త పెద్ది అయ్యింది. దాంతో.. అసహనానికి లోనైన ముగ్గురు వ్యక్తులు మహిళా కానిస్టేబుల్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతేకాదు.. కత్తితో ఆమె ముఖంపై దారుణంగా దాడి చేశారు. నిందితుల దాడిలో మహిళా కానిస్టేబుల్‌ పుర్రకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దాడి చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ రక్తపు మడుగులో పడిఉన్న మహిళా కానిస్టేబుల్‌ను రైల్వే అదికారులు గుర్తించారు. వెంటనే చికిత్స కోసం ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ఆమె చికిత్స పొందింది. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా.. మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి పారిపోయిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం సీసీ ఫుటేజ్‌ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పోలీసుల కంటపడ్డారు. పోలీసులను చూడగానే నిందితులు వారిదగ్గరున్న తుపాకీతో కాల్పులు జరపడం మొదలుపెట్టారు. దాంతో.. పోలీసులు కూడా నిందితులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే అనీశ్‌ అనే నిందితుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. మరో ఇద్దరికి బుల్లెట్‌ గాయాలు అయ్యాయనీ.. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి ముగ్గురు నిందితుల్లో ఒకరు చనిపోగా.. మిగతా ఇద్దరు బుల్లెట్ గాయాలతో పోలీసులకు చిక్కారు. కాగా.. ఎన్‌కౌంటర్‌ ఘటనలో పోలీసులకు కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది.

Next Story