ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ విఫలం.. చెల్లిని 40 సార్లు పొడిచి చంపిన అన్న!

హోళీ పండుగ పూట కలిసుందామని వచ్చిన ఆ కుటుంబంలో రక్తం ఏరులై పారింది. ప్రేమ విఫలమైందన్న కోపంతో...

By -  అంజి
Published on : 8 March 2026 9:38 AM IST

Moradabad Murder Case, Twin Sister Killed, Instagram Love Breakup, Hardik and Himshikha, Majhola Police Station, Depression and Crime, Uttar Pradesh Crime News

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ విఫలం.. చెల్లిని 40 సార్లు పొడిచి చంపిన అన్న!

హోళీ పండుగ పూట కలిసుందామని వచ్చిన ఆ కుటుంబంలో రక్తం ఏరులై పారింది. ప్రేమ విఫలమైందన్న కోపంతో, డిప్రెషన్‌లోకి వెళ్లిన ఓ యువకుడు తన కన్నతల్లి, తోడబుట్టిన సోదరిపైనే కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో 25 ఏళ్ల హిమ్శిఖ అనే యువతి ప్రాణాలు కోల్పోగా, ఆమె తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మొరాదాబాద్‌లోని బుద్ధి విహార్ కాలనీలో నివసించే నీలిమకు హార్దిక్, హిమ్శిఖ అనే కవల పిల్లలు ఉన్నారు.

వీరిద్దరూ గురుగ్రామ్‌లో ఉద్యోగం చేస్తూ, హోలీ పండుగ కోసం ఇంటికి వచ్చారు. శుక్రవారం తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పుణెకు చెందిన ఒక యువతితో హార్దిక్ ప్రేమలో పడ్డాడు. అయితే ఏడు నెలల క్రితం వారి బ్రేకప్ అయ్యింది. అప్పటి నుంచి హార్దిక్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. తన ప్రేమ విఫలం కావడానికి తన తల్లి, సోదరియే కారణమని అతను బలంగా నమ్మాడు. శుక్రవారం తల్లి ఆఫీసుకి వెళ్లిన సమయంలో, హార్దిక్ ఇంట్లో ఒంటరిగా ఉన్న తన సోదరిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె శరీరంపై 40కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. అనంతరం తల్లి ఆఫీసుకి వెళ్లి, ఏదో వంకతో ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న కూతురిని చూసి ఆమె కేకలు వేయగా, ఆమెపై కూడా కత్తితో దాడి చేసి కారులో పరారయ్యాడు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా, హిమ్శిఖ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story