తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే రైలు కింద దూకి క్షణాల్లో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తునిలో సంచలనం రేపింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ రికార్డయ్యాయి. తుని రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడు.. ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్నాడు. ఫ్లాట్ ఫారమ్‌పై అటూ ఇటూ సరదాగా తిరిగాడు. ఇంతలో రైలు రెండవ నంబర్ ప్లాట్‌ఫారమ్ వైపు హారన్ మోగిస్తూ వస్తోంది. అది గమనించిన యువకుడు.. చకచకా ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్ నుంచి దిగి పట్టాలు దాటి.. రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అంతే ఆ తర్వాత యువకుడిపై నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో యువకుడు రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పటి వరకు ఫ్లాట్ ఫారమ్‌పై అటు ఇటు తిరిగిన యువకుడు.. అక్కడికక్కడే మృతి చెందడంపై అక్కడున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పోలీసులు మృతుడి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.