సీఎంకు లేఖ రాసి నిరుద్యోగి ఆత్మహత్య.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ
Unemployed man commits suicide in Mancherial dist.రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on
31 Oct 2021 6:26 AM GMT

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నోటిపికేషన్ల కోసం ఎదురుచూసి.. అవి రాకపోవడంతో ఆందోళన చెందిన కొందరు తమకు ఇక ఉద్యోగం రాదనే మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణలో ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆ లేఖలో కోరాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్(25) టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. కొన్నాళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే.. నోటిఫికేషన్లు ఎంతకీ రాకపోవడంతో మనస్థాపం చెందాడు. ఇక ఉద్యోగం రాదని తీవ్ర నిరాశకు గురైయ్యాడు. ఈ క్రమంలో దారుణ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story