భర్తతో కలిసి వెళుతూ ఉండగా.. బంగారు గొలుసు లాగేశారు

సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీల్‌పూర్ గ్రామంలో పట్టపగలు ఓ మహిళ నుంచి బంగారు గొలుసు లాక్కున్న ఆరోపణలపై ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

By అంజి  Published on  8 Sept 2024 8:30 PM IST
youth, Bidar, Sangareddy , chain snatching

భర్తతో కలిసి వెళుతూ ఉండగా.. బంగారు గొలుసు లాగేశారు

సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాల్‌కల్ మండలం ఖలీల్‌పూర్ గ్రామంలో పట్టపగలు ఓ మహిళ నుంచి బంగారు గొలుసు లాక్కున్న ఆరోపణలపై బీదర్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఫిర్యాదు మేరకు హద్దనూరు పోలీసులు ఆదివారం రుక్మాపూర్ చౌరస్తాలో నిందితులని పట్టుకున్నారు.

హద్దనూరు ఎస్‌ఐ రామానాయుడు మాట్లాడుతూ బాధితురాలు కురు రుక్మిణి(55), ఆమె భర్త సంగప్పతో కలిసి ద్విచక్రవాహనంపై జహీరాబాద్‌ నుంచి రెజింతల్‌ వైపు వెళ్తున్నారు. వీరిని వెనుక నుంచి వెంబడించిన నిందితులు ఖలీల్‌పూర్ వద్ద వారిని అడ్డుకుని రుక్మిణి గొలుసు లాక్కెళ్లారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో నిందితులు సయ్యద్ మహ్మద్ (25), షేక్ నధియాల్ దొరికిపోయారు. ఇద్దరూ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి చెందినవారని తేలింది. మహ్మద్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, నదియాల్ బి-ఫార్మసీ విద్యార్థి. వారి నుంచి 3.5 తులాల బంగారు గొలుసు, పల్సర్ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

Next Story