స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి ప్రాణులు కోల్పోయింది.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 2:58 PM ISTస్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి ప్రాణులు కోల్పోయింది. తన సోదరుడు స్కూల్‌కు వెళ్తున్న సమయంలో.. తండ్రితో పాటు చిన్నారి కూడా బస్సు వద్దకు వెళ్లింది. అయితే.. అదే సమయంలో బస్సు కింద ప్రమాదవశాత్తు పడింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ద్వారా స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
హబ్సిగూడలోని రవీంద్రనగర్ కాలనీలో మిథున్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. కొడుకు స్థానికంగా ఉన్న ఓస్కూల్‌లో చదువుతున్నాడు. రెండో సంతానం పాప పుట్టింది. ఆమె పేరు జావ్లానా. రెండేళ్ల వయసు. అయితే.. గురువారం ఉదయం బాబు స్కూల్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో అతన్ని స్కూల్ బస్సు ఎక్కించేందుకు తండ్రి వెంటే వెళ్లాడు. ఆ సమయంలో పాప కూడా తండ్రి వెంటే ఉంది. తన కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించాడు మిథున్. ఆ తర్వాత డ్రైవర్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. అక్కడే ఉన్న చిన్నారి తండ్రి వద్దకు పరుగెత్తుకు వచ్చింది. అదే సమయంలో బస్సు డ్రైవర్ గమనించకుండా ముందుకు నడిపించాడు. దాంతో.. ఆ రెండేళ్ల పాప స్కూల్ బస్సు టైర్ల కింద పడిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందనీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. వరుసగా హైదరాబాద్‌లో చిన్నారులు స్కూల్ బస్సుల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.