ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగినిపై బెంగళూరులో అఘాయిత్యం
Two Nigerians held for raping AP woman.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు
By తోట వంశీ కుమార్ Published on 4 Sep 2021 7:38 AM GMTదేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు నైజీరియను అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ ఇద్దరు నిందితులను పోలీసులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన ఓ యువతి బెంగళూరులోని ఓ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు నైజీరియాకు చెందిన టోనీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆగస్టు 31న కమ్మరహళ్లిలోని టోనీ ఇంటికి ఆ యువతి వెళ్లింది. అక్కడ ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చారు. తెలియక తాగిన ఆ యువతి మత్తులోకి జారుకుంది. ఉదయం లేచి చూసే సరికి తన పక్కన నగ్నంగా మరో వ్యక్తి నగ్నంగా ఉండటం చూసి షాక్‌కు గురైంది.
తాను మత్తులో ఉన్న సమయంలో టోనీతో పాటు మరో యువకుడు తనపై అత్యాచారం చేశాడని గ్రహించింది. బాణసవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు టోనీతో పాటు అతడి స్నేహితుడు ఉబాకా ని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నైజీరియా రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపారు.