రాత్రి త‌ల్లి ప‌క్క‌న ప‌డుకున్న 2 నెల‌ల చిన్నారి.. ఉద‌యం నీటి ట్యాంకులో..

Two Months boy suspicious death in Ranga reddy district.రాత్రి త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నిద్రిస్తున్న‌ రెండు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 7:05 AM GMT
రాత్రి త‌ల్లి ప‌క్క‌న ప‌డుకున్న 2 నెల‌ల చిన్నారి.. ఉద‌యం నీటి ట్యాంకులో..

రాత్రి త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నిద్రిస్తున్న‌ రెండు నెల‌ల చిన్నారిని తెల్ల‌వారేస‌రికి ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో మృత‌దేహాంగా కనిపించాడు. ఈ విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన రంగ‌య్య కుమారై బాల‌మ‌ణి రెండు నెల‌ల క్రితం బాలుడికి జ‌న్మ‌నిచ్చింది. రోజు మాదిరిగానే గురువారం రాత్రి కూడా ఇంట్లోనే బాలుడితో పాటు కుటుంబ స‌భ్యులు నిద్ర‌కు ఉప‌క్ర‌మించారు. అయితే.. తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల సమ‌యంలో చిన్నారి క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందారు. వెంట‌నే చిన్నారి కోసం చుట్టు ప్ర‌క్క‌లా అంతా గాలించారు. ఎక్క‌డా బాలుడు క‌నిపించ‌లేదు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజిలు పరిశీలించినా ఎటువంటి క్లూ లభించలేదు.

దీంతో బాలుడి ఇంటిని పోలీసులు అణువణువునా గాలించారు. చివ‌ర‌కు ఇంటిపై క‌ప్పుపై ఉన్న నీటి ట్యాంకును ప‌రిశీలించ‌గా బాలుడి మృత‌దేహాం అందులో క‌నిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ త‌గాదాల నేప‌థ్యంలో హ‌త్య జ‌రిగి ఉంటుంద‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా చిన్నారి హత్యకేసుతో మేనమామ, అత్తకు సంబంధమున్నట్లు ఆరోపణలు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు

Next Story
Share it