త్రిపుర‌లో దారుణం.. ఇద్ద‌రు బాలిక‌ల‌పై 8 మంది అత్యాచారం

Two Minor girls Gang Raped in Tripura.త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై 8 మంది యువకులు అత్యాచారం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 5:47 AM GMT
Two Minor girls Gang Raped in Tripura

త్రిపురలోని ఖౌవాయి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ బాలిక ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు మ‌రో ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో ఆరుగురు యువకులు బైక్‌లపై వచ్చి వారిని కలిశారు. అనంత‌రం అంద‌రూ క‌లిసి రాత్రి ఏడున్న‌ర స‌మ‌యంలో బాలిక‌ల‌ను ద‌ట్ట‌మైన అడ‌విలోకి తీసుకెళ్లారు. అక్క‌డ బాలిక‌ల‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

దీంతో బాలిక‌లు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. దీంతో నిందితులు భ‌య‌ప‌డి వాళ్ల‌ను అక్క‌డే వ‌దిలివేసి ప‌రార‌య్యారు. బాలిక‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో భ‌య‌ప‌డిన త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాలిక‌ల త‌ల్లిదండ్రులు గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో అడ‌విలో అప‌స్మార‌క స్థితిలో బాలిక‌లు క‌నిపించారు. వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఇద్ద‌రు బాలిక‌ల్లో ఓ బాలిక ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఆమెను మ‌రో ఆస్ప‌త్రికి సిఫార్సు చేశారు. ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో నిందితుల‌ను అరెస్టు చేశారు.
Next Story
Share it