Hyderabad: ఐరన్ బాక్స్‌లో బంగారం స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 1.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
By అంజి Published on 6 Aug 2023 2:45 AM GMTHyderabad: ఐరన్ బాక్స్‌లో బంగారం స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 1.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారని, దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారి శనివారం తెలిపారు. రూ.1.1 కోట్ల విలువ చేసే 2 కేజీల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ఇద్దరు జెడ్డా ప్రయాణీకుల అరెస్ట్ చేశారు. కేటుగాళ్లు బంగారాన్ని స్పీకర్స్, ఐరన్ బాక్స్‌లో దాచి తరలించే యత్నం చేశారు. ప్రొఫైలింగ్ ఆధారంగా జెడ్డా నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు.
కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో అక్రమ బంగారం వ్యవహారం కాస్త బయటపడింది. సాధారణ బరువు కంటే ఎక్కువ తూకం ఉన్న ఐరన్ బాక్స్ పై అనుమానం రావడంతో అధికారులు డిస్ మెటిరియల్ చేశారు. స్పీకర్స్, ఐరన్ బాక్స్ లో దాచి పెట్టిన బంగారం గుట్టు రట్టు అయ్యింది. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులిద్దరూ కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 132, 135 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని స్పష్టమైందని అధికారి తెలిపారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద ప్రయాణికులను అరెస్టు చేశారు. ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో స్మగ్లింగ్ రాకేట్ గుట్టును అహ్మదాబాద్ డీఆర్‌ఐ అధికారులు రట్టు చేశారు. రూ. 100 కోట్ల విలువ చేసే వివిధ బ్రాండెడ్ వస్తువులు సీజ్ చేశారు. ముగ్గురు స్మగ్లర్ల ఆట కట్టించిన డీఆర్‌ఐ అధికారులు.. వారి వద్ద నుండి భారీగా ఈ-సిగరెట్లు, బ్రాండెడ్ మొబైల్ ఉపకరణాలు, ప్రీమియం బ్రాండెడ్ షూలు, బ్యాగ్‌లు, పెర్ఫ్యూమ్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల సీజ్ చేశారు. ముంద్రా పోర్టును అడ్డాగా చేసుకొని కేటుగాళ్లు స్మగ్లింగ్ కు తెరలేపారు.